naa telugu kaburlu....

Saturday, September 19, 2009

అందమైన సినీ గీతాలు

నాకు ఎంతో ఇష్టమైన తెలుగు సినీ గీతాలు కొన్ని ఇక్కడ మీ ముందు ఉంచుతాను..
ఇప్పటి వరకు వినని వారు విని ఈ పాటల్ని అభిమానిస్తారు అని ఒక కోరిక

మొదట మీరు నిరీక్షణ లో పాట చూడబోతున్నారు



ఆకాశం ఏ నాటిదో.. అనురాగం ఆనాటిది.. (2)
ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే.. తెలిసిందది (2)
ఆకాశం ఏ నాటిదో.. అనురాగం ఆనాటిది.. (2)

ఏ పూవు ఏ తేటిదన్నది ఏ నాడో రాసున్నది,
ఏ ముద్దు ఏ మోవిదన్నది ఏ పొద్దో రాసున్నది,
బంధాలై పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా,
మందారం విరబూయు పెదవులు మధువులనే చవి చూడమనగా,
పరువాలే.... ప్రణయాలై.....
స్వప్నాలే.... స్వర్గాలై.....

ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేలి అలిగెను

ఆకాశం ఏ నాటిదో.....

ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తెనో,
ఏ రాగం ఏ గుండె లోతున ఏ గీతం పలికించెనో,
హృదయాలే తెరతీసి తనువుల కలబొసీ మరపించమనగా,
కౌగిలిలో చెరవేసి మదనుని కరిగించీ గెలిపించమనగా,
మోహాలే..... దాహాలై...
సరసాలే... సరదాలై...
కాలాన్నే నిలవేసి కలలకు ఇవ్వాలి వెలలేని విలువలు

ఆకాశం ఏ నాటిదో...

Saturday, March 07, 2009

తప్పక చూడదగిన 25 తెలుగు చిత్రములు

ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే...

కింద ఉన్న చిత్రాలు ఏ క్రమము అనుసరించి లేవు...

పెళ్ళి పుస్తకం
నిరీక్షణ
రుద్ర వీణ
శ్రీవారికి ప్రేమలేఖ
జగదేక వీరుడు అతిలోక సుందరి
మిస్సమ్మ
మాయా బజారు
భూకైలాస్
పాతాళ భైరవి
సాగర సంగమం
స్వర్ణ కమలం
సంపూర్ణ రామాయణం
తెనాలి రామక్రిష్ణ
మోసగాళ్ళకి మోసగాడు
అంతులేని కథ
పదహారేళ్ళ వయసు
మరో చరిత్ర
శంకరాభరణం
క్షణ క్షణం
యమ లీల
గోదావరి
గీతాంజలి
ఆదిత్య 369
లవ కుశ
భక్త ప్రహ్లాద

Labels:

Wednesday, November 26, 2008

ఇప్పటి Software Industry తీరు

Sunday, January 20, 2008

స్వార్థం

మనం ఎక్కువ గా వినే పర నిందల్లొ ఒకటి "నువ్వు చాలా స్వార్థపరుడివి".
నిజానికి ఆలోచిస్తే ఈ ప్రపంచం లొ ఎవడు స్వార్థపరుడు కాదంటారు.

తల్లి తండ్రులు పిల్ల లకి జన్మ నిచ్చి వాల్లని పెంచి పెద్దవాల్లని చేసారు అంటే అది వాల్ల తృప్తి కోసమో లేక ఈ సమాజం కొసమో.
మనం చదువుకునేది ఙానం కొసం.
ఒకడు మనకి సహాయం చెస్తున్నాడు అంటె రేపు పొద్దున వాడికి మనం అవసరం రాకుండ పోతామా అన్న ఉద్దేసం తోనే.
ఇక దాన ధర్మాలు గట్రా పాప భీతి తో చేసే పనులు.
దేవతార్చన ముక్తి కోసం, మోక్షం కోసం.

కాబట్టి ప్రతి వాడు డబ్బు,ఆనందం,మోక్షం ఇలా ఎదో ఒక దానికి ఆశపడుతూనే ఉంటాడు.

నేను రాసింది చదివిన కొంత మంది నా వాదన తప్పు అని వాదించవచ్చు కనీ ఇది పచ్చి నిజం.కాదంటారా?

అందుకని ఈ సారి ఎవరినైనా 'స్వార్థం' అన్న పేరు తో నిందించేముందు కుంచం ఆలోచించండి.

Sunday, October 28, 2007

ప్రాణం ఖరీదు

మనం రోజు పేపరు లో చదువుతూ ఉంటాము ఎవరో ఎవరినో హత్య చెసారని కానీ ఎన్ని సందర్భాలలొ ఆ మనిషి పోవటం వలన కలిగే నష్టం గురించి ఆలోచిస్తాము చెప్పండి.

ఒక మనిషి కి ఇంకో మనిషిని చంపే హక్కు ఉందంటారా?

ఒకో సారి ఆలొచిస్తుంటే మన చుట్టు ఉన్న సమాజాన్ని చూస్తుంటె భయం వేస్తుంది..
ఎవడిని నమ్మాలొ ఎవడిని నమ్మ కూడదో ఎవడు ఏ విధం గా ప్రవర్తిస్థాడో తెలియదు..టూకీ గ చెప్పాలంటే సమాజం లొ కాదు క్రూర మృగాలు నివసించే అడవి లొ ఉంటున్నామా అనిపిస్తుంది.

మనిషి ప్రాణం తీసే హక్కు స్రుష్టి కర్తకే ఉంది అని నా అభిప్రాయం..
ఏ రోగమో రొష్టొ వచ్చి చావదం వేరు..బలవంతం గా చంపబడటం వేరు..అలా చని పొయే ముంది ఆ ప్రాణి ఎంత విల విలలాడి వుంటుందో!

ఒక వ్యక్తి మరణం మానసికం గా తన మీద ఆధారపడిన, తన పైనే
ఆశలు పెట్టుకున్న వారిని ఎంత క్రుంగదీస్తుందో అనుభవానికి వస్తే కానీ అర్ధం కదు..అలా అనుభవం పొందిన నాడు మృగం మనిషి గా మరుతుందేమో...

Wednesday, May 16, 2007

శ్రీ రామ

నాకు రాములవారంటే ఎందుకో ప్రత్యేకమైన అభిమానం.ఎవరైనా ఆయాస పడుతున్నప్పుడు "అమ్మ" అంటారేమో కానీ నేను "రామా" అంటాను.ఎలా అలవాటు అయ్యిందో గుర్తు లేదు మరి.
ఈ మధ్య తిరుపతి వెళ్ళినప్పుడు కపిల తీర్థం కి వెళ్ళే దారిలో కనపడిన రాముల వారి విగ్రహాలు ఇవి.ఎండకు ఎండి వానకు తడవటం వల్ల పాతబడ్డాయేమో కానీ ..ఎదో తెలియని ఆకర్షన ఉంది వాటిలో.

Monday, May 07, 2007

సంగీత సరస్వతి


M S శుబ్బు లక్ష్మి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే నేమో...
ఆవిడ గురించి ఇది వరకు నా ఇంగ్లిష్ బ్లాగు లో రాసాను..

ఇదిగో ఈ పైంటింగ్ కనపడింది ..దీన్ని మీ అందరికి కుడా చూపిద్దాం అని ఇక్కడ పెడుతున్నా..

Free Hit Counters
Free Counter