naa telugu kaburlu....

Sunday, October 28, 2007

ప్రాణం ఖరీదు

మనం రోజు పేపరు లో చదువుతూ ఉంటాము ఎవరో ఎవరినో హత్య చెసారని కానీ ఎన్ని సందర్భాలలొ ఆ మనిషి పోవటం వలన కలిగే నష్టం గురించి ఆలోచిస్తాము చెప్పండి.

ఒక మనిషి కి ఇంకో మనిషిని చంపే హక్కు ఉందంటారా?

ఒకో సారి ఆలొచిస్తుంటే మన చుట్టు ఉన్న సమాజాన్ని చూస్తుంటె భయం వేస్తుంది..
ఎవడిని నమ్మాలొ ఎవడిని నమ్మ కూడదో ఎవడు ఏ విధం గా ప్రవర్తిస్థాడో తెలియదు..టూకీ గ చెప్పాలంటే సమాజం లొ కాదు క్రూర మృగాలు నివసించే అడవి లొ ఉంటున్నామా అనిపిస్తుంది.

మనిషి ప్రాణం తీసే హక్కు స్రుష్టి కర్తకే ఉంది అని నా అభిప్రాయం..
ఏ రోగమో రొష్టొ వచ్చి చావదం వేరు..బలవంతం గా చంపబడటం వేరు..అలా చని పొయే ముంది ఆ ప్రాణి ఎంత విల విలలాడి వుంటుందో!

ఒక వ్యక్తి మరణం మానసికం గా తన మీద ఆధారపడిన, తన పైనే
ఆశలు పెట్టుకున్న వారిని ఎంత క్రుంగదీస్తుందో అనుభవానికి వస్తే కానీ అర్ధం కదు..అలా అనుభవం పొందిన నాడు మృగం మనిషి గా మరుతుందేమో...

Free Hit Counters
Free Counter