naa telugu kaburlu....

Sunday, January 20, 2008

స్వార్థం

మనం ఎక్కువ గా వినే పర నిందల్లొ ఒకటి "నువ్వు చాలా స్వార్థపరుడివి".
నిజానికి ఆలోచిస్తే ఈ ప్రపంచం లొ ఎవడు స్వార్థపరుడు కాదంటారు.

తల్లి తండ్రులు పిల్ల లకి జన్మ నిచ్చి వాల్లని పెంచి పెద్దవాల్లని చేసారు అంటే అది వాల్ల తృప్తి కోసమో లేక ఈ సమాజం కొసమో.
మనం చదువుకునేది ఙానం కొసం.
ఒకడు మనకి సహాయం చెస్తున్నాడు అంటె రేపు పొద్దున వాడికి మనం అవసరం రాకుండ పోతామా అన్న ఉద్దేసం తోనే.
ఇక దాన ధర్మాలు గట్రా పాప భీతి తో చేసే పనులు.
దేవతార్చన ముక్తి కోసం, మోక్షం కోసం.

కాబట్టి ప్రతి వాడు డబ్బు,ఆనందం,మోక్షం ఇలా ఎదో ఒక దానికి ఆశపడుతూనే ఉంటాడు.

నేను రాసింది చదివిన కొంత మంది నా వాదన తప్పు అని వాదించవచ్చు కనీ ఇది పచ్చి నిజం.కాదంటారా?

అందుకని ఈ సారి ఎవరినైనా 'స్వార్థం' అన్న పేరు తో నిందించేముందు కుంచం ఆలోచించండి.

Free Hit Counters
Free Counter